బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 17, 2020 , 17:17:42

క‌రోనా వైర‌స్‌.. 2వేల ఐఫోన్లు ఫ్రీగా ఇచ్చారు

క‌రోనా వైర‌స్‌.. 2వేల ఐఫోన్లు ఫ్రీగా ఇచ్చారు

హైద‌రాబాద్‌: జ‌పాన్ తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్‌సెస్ నౌక‌లో ఉన్న ప్ర‌యాణికుల‌కు సుమారు 2వేల ఐఫోన్ల‌ను జ‌పాన్ ప్ర‌భుత్వం ఉచితంగా అంద‌జేసింది.  లైన్ యాప్ ఉన్న ఫోన్ల‌ను ప్ర‌యాణికుల‌కు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ సోకిన ప్ర‌యాణికులు నౌక‌లో ఉన్న కార‌ణంగా.. ఆ నౌకను గ‌త కొన్ని రోజుల నుంచి క్వారెంటైన్ చేశారు. అయితే ప్ర‌యాణికుల క్షేమ స‌మాచారం తెలుసుకునేందుకు ఐఫోన్ల‌ను పంపిణీ చేశారు.  ఫోన్ల‌లో ఉన్న లైన్ యాప్ ద్వారా .. ప్ర‌యాణికులు మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌తో ట‌చ్‌లో ఉండ‌వ‌చ్చు.  దాని ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, చికిత్స పొంద‌వ‌చ్చు.  సైకాలజిస్ట్‌ల స‌ల‌హాలు కూడా తీసుకునేందుకు జ‌పాన్ ప్ర‌భుత్వం ఆ ఫోన్ల‌ను అంద‌జేసింది.  జ‌పాన్ బ‌య‌ట రిజిస్ట‌ర్ చేసుకున్న ఫోన్ల నుంచి లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం వీలు కాదు. అందుకే జ‌పాన్ ప్ర‌భుత్వ‌మే ప్ర‌త్యేకంగా 2వేల ఫోన్ల‌ను ప్ర‌యాణికుల‌కు అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది. logo