ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 26, 2020 , 14:07:59

రూ. 25 కోట్లు సంపాదించిన విద్యార్థిని.. ఎలాంటి స్పంద‌న‌లేదు!

రూ. 25 కోట్లు సంపాదించిన విద్యార్థిని.. ఎలాంటి స్పంద‌న‌లేదు!

అదేంటి.. క్లాసులు వింటే తెలివితేట‌లు పెరుగుతాయి, స‌బ్జెక్ట్ నేర్చుకుంటారు. మ‌హా అయితే చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత ఉద్యోగం చేసి డ‌బ్బు సంపాదిస్తారు. కానీ ఓ విద్యార్థిని మాత్రం క్లాస్ రూంలో పాఠాలు వింటూనే కోట్ల‌లో డ‌బ్బు సంపాదించింది. అయినా ఆమెలో ఎలాంటి స్పంద‌న లేదు. ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏండ్ల విశ్వ‌విద్యాల‌య విద్యార్థిని క్లాస్‌లో పాఠాలు వింటూ మెయిల్ చెక్ చేసుకున్న‌ది. ఆమె లాట‌రీ గెలుచుకున్న‌ట్లు మెయిల్ వ‌చ్చింది.

ఆ లాట‌రీ ల‌క్ష‌ల్లో కాదు కోట్ల‌లోనే ఉంది. లోప‌ల ఆనందం ప‌ట్ట‌లేక‌పోయినా బ‌య‌ట మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఎందుకంటే క్లాస్‌కు భంగం క‌లిగించ‌కూడ‌ద‌ని. క్లాస్ అయిపోయిన త‌ర్వాత  ఈ విష‌యం బ‌య‌ట పెట్టింది. 3.4  మిలియ‌న్ డాల‌ర్ల లాట‌రీ గెలుచుకున్న‌ది. అంటే భార‌త్ క‌రెన్సీలో సుమారు రూ. 25,27,47,500 వ‌ర‌కు ఉంటుంది. 'సెట్ ఫర్ లైఫ్' లాటరీని గెలుచుకుంది. ఈ డ‌బ్బుతో ఏం చేస్తావ‌ని అడిగితే తన తల్లి కోసం ఒక ఇల్లు, త‌న కోసం ఒక ఇల్లు కొంటానంటున్న‌ది. ఇంకా విదేశాలు తిర‌గడానికి ఇష్ట‌ప‌డుతాన‌ని చెప్పుకొచ్చింది ల‌క్కీగాళ్‌.   


logo