గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 15:58:56

ఐఈడీ పేలుడులో 20 మందికి గాయాలు

ఐఈడీ పేలుడులో 20 మందికి గాయాలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కైబ‌ర్ పంక్తున్‌క్వా ప్రావిన్స్ లో గ‌ల మార్కెట్‌లో ఐఈడీ బాంబు పేలింది. ఈ పేలుడులో 20 మంది వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ నజాబ్ అలీ మీడియా వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ... ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుగా ఉన్న కుర్రం జిల్లా పరాచినార్ నగరంలోని తురి బజార్‌లో గురువారం పేలుడు సంభ‌వించిన‌ట్లు తెలిపారు. పోలీసులు, భద్రతా దళాలు, రెస్క్యూ టీమ్‌లు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గాయపడిన వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

స్వల్ప గాయాలైన ఐదుగురిని చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేయగా, మరో 15 మందికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు ఆసుపత్రి అధికారి తెలిపారు. క్ష‌త‌గాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కూర‌గాయ‌ల సంచిలో ఐఈడీ బాంబును పెట్టి రిమోట్ కంట్రోల్ ప‌రిక‌రంతో పేల్చివేసిన‌ట్లుగా పోలీసులు తెలిపారు. కాగా పేలుడు తామే బాధ్యుల‌మ‌ని ఇంత‌వ‌ర‌కు ఏ గ్రూప్ ప్ర‌క‌టించ‌లేదు.


logo