మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 12:43:59

కరోనా వల్ల జపాన్‌లోని అమెరికా నౌకా కేంద్రాల్లో లాక్‌డౌన్

కరోనా వల్ల జపాన్‌లోని అమెరికా నౌకా కేంద్రాల్లో లాక్‌డౌన్

టోక్యో: కరోనా నేపథ్యంలో జపాన్‌లోని రెండు అమెరికా నౌకా కేంద్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఒకినావా ద్వీపంలోని అమెరికా యుద్ధ నౌకల స్థావరాల్లో వేలాది మంది అమెరికా మెరైన్ సైనికులున్నారు. ఇందులో సుమారు 60 మందికిపైగా నౌకాదళ సిబ్బందితోపాటు స్థానికంగా ఉన్న సుమారు 150 మంది పౌరులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రెండు నౌకాదళ స్థావరాల్లో ఆదివారం నుంచి లాక్‌డౌన్ విధించారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, స్థానికుల కదలికలపై ఆంక్షలు విధించారు. అనుమతి లేనిదే ఎవరినీ బయటకు పంపడం లేదు. మరోవైపు కరోనా పట్ల అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్థానిక పాలక యంత్రాంగం విమర్శించింది. కరోనా నియంత్రణకు కంటైన్‌మెంట్ చర్యలను సరిగా పాటించడం‌లేదని ఆరోపించింది.
logo