బుధవారం 27 మే 2020
International - May 06, 2020 , 15:17:29

ఆ రెండు దేశాల్లో కరోనా మరణాలు ఎందుకు తక్కువ?

ఆ రెండు దేశాల్లో కరోనా మరణాలు ఎందుకు తక్కువ?

హైదరాబాద్: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మందికిపైగా బలయ్యారు. కొన్ని దేశాల్లో మరణాలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. కానీ రెండు చిన్న సంపన్న దేశాల్లో మాత్రం మరణాలు చాలాచాలా తక్కువగా నమోదయ్యాయి. ఖతార్, సింగపూర్ దేశాల్లో కరోనా రోగులను బట్టి చూస్తే మరణాల రేటు ప్రపంచ కనిష్టంగా ఉండడం గమనార్హం. ఖతార్ లో నమోదైన కరోనా రోగులు 16 వేలు కాగా మరణాలు 12 మాత్రమే (0.07%). ఇక సింగపూర్ లో 19 వేలమంది కరోనా రోగులుండగా మరణాలు 18 (0.093%) మాత్రమే. సత్వర పరీక్షలు జరపడం, మెరుగైన వైద్యసేవలు కల్పించడం ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలుగా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మరణాలు తక్కువగా ఉండడానికి రోగుల వయసు కూడా ఒక కారణం. సింగపూర్‌లో వృద్ధుల శాతం ఎక్కువే అయినప్పటికీ కరోనా వైరస్ ప్రధానంగా తక్కువ వయసున్న  వలస కార్మికుల్లో వ్యాపించడం మరణాలు తగ్గడానికి మరో కారణం. ఖతార్‌కూ ఇదే సూత్రం వర్తిస్తుంది.


logo