మంగళవారం 31 మార్చి 2020
International - Feb 04, 2020 , 08:24:19

అమెరికాలో కాల్పులు : ఇద్దరు మహిళలు మృతి

అమెరికాలో కాల్పులు : ఇద్దరు మహిళలు మృతి

టెక్సాస్‌ : అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌ ఏఅండ్‌ఎం కామర్స్‌ వర్సిటీలో ఓ ఆగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. రెండేండ్ల బాలిక గాయపడింది. కాల్పుల్లో గాయపడ్డ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రైడ్‌ రాక్‌ రెసిడెన్స్‌ హాల్‌లోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడున్న మహిళలపై కాల్పులు జరిపి పరారీ అయ్యాడు. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మహిళలు.. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుపాకీ లైసెన్స్‌ కలిగిన వ్యక్తే కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్‌ఎం కామర్స్‌ వర్సిటీలో సుమారు 1600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కాల్పుల నేపథ్యంలో యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. 


logo
>>>>>>