శనివారం 29 ఫిబ్రవరి 2020
జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనావైరస్‌..

జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనావైరస్‌..

Feb 12, 2020 , 21:28:09
PRINT
జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనావైరస్‌..

టోక్యో: జపాన్‌ తీరప్రాంతంలో ఓడలో ప్రయాణిస్తున్న  ఇద్దరు భారతీయులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. యొకొహామా పోర్టులో నిలిపివేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడలో ప్రయాణిస్తున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా..174 మంది కోవిద్‌-19 (కరోనా వైరస్‌)పాజిటివ్‌ గా తేలగా..వీరిలో ఇద్దరు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు. జపాన్‌ కు చెందిన పర్యాటక నౌక డైమండ్‌ ప్రిన్సెస్‌ లో నుంచి హాంగ్‌ కాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించిన నేపథ్యంలో..ఫిబ్రవరి 3ను నౌకను యొకొహామా పోర్టులోనే నిలిపేశారు. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మొత్తం 3700 మంది ప్రయాణికులుండగా..వీరిలో 138 మంది భారతీయులున్నట్లు సమాచారం.  ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నామని, భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని భారత రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. 
logo