శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 15:46:06

అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం!

అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం!

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో అర్ధ‌రాత్రి వేళ గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. రోచెస్ట‌ర్‌లోని ప‌బ్లిక్ మార్కెట్ ప‌రిస‌రాల్లో వేర్వేరు కాల్పుల ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 16 మంది గాయ‌ప‌డ‌గా.. వారిలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంట‌ల‌కు, భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ ఉద‌యం సుమారు 11 గంట‌ల‌కు కాల్పులు జ‌రిగాయి.

కాగా, దేశంలో నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే వారిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo