మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 22:50:19

పాక్‌లో 2.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

పాక్‌లో 2.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్ర‌పంచ దేశాలను వణికిస్తున్న‌ది. రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న‌ది. పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్త‌గా 2,769 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాకిస్థాన్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,51,625కు చేరింది. ఈ వివరాలను పాకిస్థాన్‌ ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అలాగే అక్కడ కొత్తగా 69 కరోనా మరణాలు కూడా సంభవించాయని తెలిపింది. దీంతో పాకిస్థాన్‌లో న‌మోదైన‌ మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,266కు చేరింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo