శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 10:12:18

ఒక్క రోజే 2,30,000 పాజిటివ్ కేసులు

ఒక్క రోజే 2,30,000 పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్‌: ఆదివారం ఒక్క రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా 2,30,000 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. అమెరికాలోనే అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఆ దేశంలో అత్య‌ధికంగా 1,42,992 కేసులు న‌మోదు అయ్యాయి.  అమెరికా త‌ర్వాత స్థానంలో ద‌క్షిణ ఆసియా ఉన్న‌ది.  ఇక వైర‌స్ మ‌ర‌ణాల్లో ఇట‌లీ దేశాన్ని మెక్సికో దాటేసింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల 5,285 మంది మ‌ర‌ణించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. 

వైర‌స్ కేసుల‌ను అదుపు చేసేందుకు పాల‌స్తీనా.. వెస్ట్ బ్యాంక్‌లో క‌ర్ఫ్యూ విధించింది. ఇక అత్య‌ధిక స్థాయిలో మ‌ర‌ణాలు కూడా అమెరికాలోనే సంభ‌వించాయి. బొలివియాకు చెందిన ఆర్థిక మంత్రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 12.9 మిలియ‌న్ల కేసులు న‌మోదు అయ్యాయి.  5,68,000 మంది మ‌ర‌ణించారు. గ‌త 24 గంట‌ల్లో ద‌క్షిణ ఆసియాలో 33,173, యూరోప్‌లో 18,804, ఆఫ్రికాలో 17,884, మెడిట‌రేనియ‌న్‌లో 15,361, ప‌సిఫిక్‌లో 2,156 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.


logo