బుధవారం 08 జూలై 2020
International - May 28, 2020 , 16:33:59

పాక్‌లో ఒకే రోజు 2 వేలకుపైగా కరోనా కేసులు

పాక్‌లో ఒకే రోజు 2 వేలకుపైగా కరోనా కేసులు

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో ఒకే రోజు 2076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు సంఖ్య 61,227కి పెరిగింది. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మొత్తం 1240 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ప్రాణాంతక వైరస్‌ బారినపడినవారిలో 20,231 మంది కోలుకున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో సింధ్‌ ప్రావిన్స్‌లో 24,206, పంజాబ్‌లో 22037, కైబర్‌లో 8483, బలూచిస్థాన్‌లో 3616, ఇస్లామాబాద్‌లో 2015 కేసులు ఉన్నాయి.      

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 58,13,239 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 3,57,892 మంది మరణించారు. మరో 25,14,940 మంది బాధితులు కోలుకోగా, 29,40,407 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


logo