బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 23, 2020 , 01:49:42

2,000 ఏండ్ల నాటి మృతదేహాలు!

2,000 ఏండ్ల నాటి మృతదేహాలు!

రోమ్‌: సుమారు 2 వేల ఏండ్ల కిందటి రెండు మృతదేహాల శిథిలాలు బయటపడ్డాయి. ఇటలీలోని పోంపీలో పురావస్తు శాస్త్రవేత్తలు శనివారం వీటిని గుర్తించి వెలికితీశారు. క్రీస్తు శకం 79లో వెసువియస్‌ అగ్నిపర్వతం పేలడం వల్ల ఇద్దరు పురుషులు మరణించినట్లు నిర్ధారించారు. పక్కపక్కనే బోర్లాపడి చనిపోయిన వీరిలో 30-40 ఏండ్ల మధ్య వయసున్న వ్యక్తి ధనికుడిగా, 18-25 ఏండ్ల మధ్య వయసున్న యువకుడ్ని ఆయన దగ్గర పని చేసే వ్యక్తిగా భావిస్తున్నారు. క్రీస్తు శకం 79 అక్టోబర్‌ 25న ఈ ఘటన జరిగి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. లావా ప్రయాణించిన ప్రాంతంలోని వారంతా మరణించారని చెప్పారు. 2017లో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో మూడు గుర్రం కళేబరాల శిథిలాలు బయటపడిన విషయాన్ని గుర్తు చేశారు.