గురువారం 28 జనవరి 2021
International - Jan 12, 2021 , 16:01:21

ఆమెకు ఇవాళే మ‌ర‌ణ‌శిక్ష.. స్టే ఇచ్చిన అమెరికా కోర్టు

ఆమెకు ఇవాళే మ‌ర‌ణ‌శిక్ష.. స్టే ఇచ్చిన అమెరికా కోర్టు

క‌న్సాస్‌: అమెరికాకు చెందిన లీసా మాంట్‌గోమోరి అనే మ‌హిళ‌కు ఇవాళ మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేయాల్సి ఉంది.  ఇండియానా జైలులో ఆమెకు విష‌పూరిత ఇంజ‌క్ష‌న్ ఇచ్చి శిక్ష‌ను అమ‌లు చేయాలి. కానీ అమెరికా కోర్టు ఆమె మ‌ర‌ణంపై 24 గంట‌ల స్టే విధించింది.  2004లో ఓ గ‌ర్భిణిని చంపి.. ఆమె క‌డుపులో ఉన్న శిశువుతో లీసా పరారైంది. ఆ కేసులో దోషిగా తేలిన లీసాకు మ‌ర‌ణ‌శిక్ష ఖ‌రారైంది.  లీసా మాన‌సిక ఆరోగ్యం స‌రిగా లేద‌ని జ‌డ్జి ప్యాట్రిక్ హ‌న్లాన్ మ‌ర‌ణ శిక్ష అమ‌లును నిలిపివేశారు. గ‌త 67 ఏళ్ల‌లో ఓ మ‌హిళ‌కు ఖ‌రారైన మ‌ర‌ణ‌శిక్ష‌ను ఆడ్డుకోవ‌డం ఇదే తొలిసారి.  హ‌త్య‌కు గురైన గ‌ర్భిణికి పుట్టిన అమ్మాయి వ‌య‌సు ఇప్పుడు 16 ఏళ్లు.  విక్టోరియా జో అనే ఆ అమ్మాయి.. లీసా మ‌ర‌ణ‌శిక్ష అంశంపై ఎటువంటి స్పంద‌న ఇవ్వ‌లేదు.   

 


logo