బుధవారం 03 జూన్ 2020
International - Apr 08, 2020 , 13:10:16

ఉద్యోగాలు కోల్పోనున్న 19.5 కోట్ల మంది : ఐఎల్‌వో

ఉద్యోగాలు కోల్పోనున్న 19.5 కోట్ల మంది :  ఐఎల్‌వో

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న‌ 40 మంది కోట్ల మంది భార‌తీయులు పేదరికంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి పేర్కొన్న‌ది. ఈ ఏడాది రెండ‌వ క్వార్ట‌ర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 19.5 కోట్ల మంది ఉద్యోగ్యాలు (ఫుల్‌టైం) కోల్పేయే ప్రమాదం ఉంద‌ని కూడా యూఎన్‌కు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ లేబ‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌ హెచ్చ‌రించింది. అంటే 6.7 శాతం వ‌ర్కింగ్ హ‌వ‌ర్స్ త‌గ్గిపోతాయ‌ని ఐఎల్ఓ అంచ‌నా వేసింది. ఐఎల్ఓ మానిట‌ర్ సెకండ్ ఎడిష‌న్‌.. కోవిడ్‌19 అండ్ ద వ‌ర‌ల్డ్ ఆఫ్ వ‌ర్క్ పేరుతో ఇంట‌ర్నేష‌న‌ల్ లేబ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ ఈ నివేదిక‌ను రిలీజ్ చేసింది. 

ఎక్కువ శాతం ప్ర‌భావం అర‌బ్ దేశాల్లో ఉంటుంద‌ని ఐఎల్ఓ అంచ‌నా వేసింది. అర‌బ్ దేశాల్లో 8.1 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారు. అంటే సుమారు 50 ల‌క్ష‌ల ఫుల్‌టైం వ‌ర్క‌ర్లు పనికోల్పోతారు. ఇక త‌ర్వాత స్థానంలో యురోప్‌(7.8 అంటే, కోటి 20ల‌క్ష‌ల‌మంది), ఆసియా(7.2 అంటే 12 కోట్ల మంది) దేశాలు ఉన్నాయి

క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి వ‌ల్ల రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఏర్పడిన ప‌రిస్థితుల క‌న్నా దారుణ‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డ‌నున్న‌ట్లు యూఎన్ పేర్కొన్న‌ది. అభివృద్ధి చెందిన‌, అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు చెందిన‌ కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు ఐఎల్ఓ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ గ‌య్ రైడ‌ర్ తెలిపారు.  చాలా వేగంగా స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేని ప‌క్షంలో కోట్లాది మంది బ్ర‌తుకులు కూలిపోయే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆయ‌న అన్నారు.


logo