సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 07:04:23

పాక్‌ కస్టడీలో 19 మంది భారతీయులు.. చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటారంటూ ఆరోపణ

పాక్‌ కస్టడీలో 19 మంది భారతీయులు.. చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటారంటూ ఆరోపణ

లాహోర్‌: చట్టవిరుద్ధంగా సరిహద్దులను దాటి తమ దేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ 19 మంది భారతీయులను పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ జైళ్లలో ఉన్నారని అధికారి ఒకరు తెలిపారు. ఇదే కేసులో మరో ముగ్గురు బంగ్లాదేశ్‌ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే నవంబర్‌ 9న పాక్‌ సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతున్నదని వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణలపై సదరు నిందితులను భద్రతా పరిరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్టు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo