బుధవారం 21 అక్టోబర్ 2020
International - Jun 02, 2020 , 16:55:47

కువైట్‌ నుంచి 185 మంది భారతీయుల తరలింపు

కువైట్‌ నుంచి 185 మంది భారతీయుల తరలింపు

కువైట్‌ : వందేభారత్‌ మిషన్‌లో భాగంగా కువైట్‌ నుంచి 185 మంది భారతీయులతో ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చికి బయల్దేరింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 10 మంది నవజాత శిశువులతో పాటు 175 మంది ప్రయాణికులు ప్రత్యేక విమానంలో బయల్దేరినట్లు కువైట్‌లోని భారతీయ రాయబార కార్యాలయం పేర్కొంది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఇప్పటివరకు 50 వేల మందికి పైగా భారత పౌరులను తరలించినట్లు పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న భారతీయుల తరలింపునకు కేంద్రం అతిపెద్ద ఆపరేషన్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. మే 7న మొదటి దశను మే 16న రెండో దశ తరలింపును చేపట్టింది. ఈ రెండో దశను కేంద్రం ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది.


logo