శనివారం 30 మే 2020
International - Apr 29, 2020 , 15:18:28

184 దేశాలు నరకం అనుభవిస్తున్నాయి

184 దేశాలు నరకం అనుభవిస్తున్నాయి

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనా మీద విరుచుకుపడ్డారు. సకాలంలో ఆ దేశం కరోనా వైరస్‌ను అదుపు చేయని కారణంగా ఇవాళ 184 దేశాలు నరకం అనుభవిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇది నమ్మశక్యం కావడం లేదు కదూ.. ఇది అనూహ్యం కూడా అని ఆయన తన రోజువారీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కరోనా కల్లోలానికి పరిహారంగా జర్మనీ 140 బిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తున్నది. అమెరికా అంతకంటే ఎక్కువ పరిహారం డిమాండ్ చేస్తుందని ట్రంప్ సూచించారు. చైనా తొలిదశలోనే వైరస్ గురించిన సమాచారాన్ని ప్రపంచ దేశాలతో పంచుకుంటే ముప్పు తగ్గేదని అమెరికా, బ్రిటన్, జర్మనీ నేతలు భావిస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని, పరిహారం డిమాండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌పై వత్తిడి తెస్తున్నారు.


logo