బుధవారం 03 జూన్ 2020
International - May 10, 2020 , 13:08:53

మ‌రో 18 అఫ్ఘ‌న్ వ‌ల‌స కార్మికుల మృత‌దేహాలు గుర్తింపు

మ‌రో 18 అఫ్ఘ‌న్ వ‌ల‌స కార్మికుల మృత‌దేహాలు గుర్తింపు

కాబూల్‌: ఇరాన్ దేశ స‌రిహ‌ద్దు స‌మీపంలో న‌దిలో మునిగిపోయార‌ని చెబుతున్న 18 మంది వ‌ల‌స కూలీల మృత‌దేహాలు గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 34కు చేరుకుంది. హెరాత్ ప్రావిన్స్ అధికారులు మాట్లాడుతూ. గుల్రాన్ జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌పై అఫ్ఘ‌న్ బృందం ద‌ర్యాప్తు ప్రారంభించింద‌ని తెలిపారు. అఫ్ఘ‌న్ విదేశాంగ శాఖ నివేదిక ప్ర‌కారం హెరాత్ ప్రావిన్స్ స‌రిహ‌ద్దు నుంచి ఇరాన్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించిన 70 మంది అఫ్ఘ‌న్‌ల‌ను కొట్టి హ‌రిరుద్ న‌దిలోకి నెట్టివేశార‌ని తేలింది. హ‌రిరుద్ న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాన్నిఆఫ్ఘ‌నిస్తాన్‌, ఇరాన్‌,  తుర్కెనిస్తాన్ పంచుకుంటాయి. కొంద‌రు కాబుల్ - టెహ్రాన్ సంబంధాలు దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ఆరోపించింది. ఈ సంఘ‌ట‌న‌లో స‌రిహ‌ద్దు సెక్యూరిటీ గార్డు ప్ర‌మేయాన్ని ఇరాన్ ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. 


logo