చైనా బొగ్గుగనిలో చిక్కుకుని 18 మంది మృతి

బీజింగ్: చైనాలోని బొగ్గు గనులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఈశాన్య చైనాలోని చాంగ్కింగ్లో ఉన్న బొగ్గుగనిలో చిక్కుకుని 18 మంది కార్మికులు మరణించారు. గత సెప్టెంబర్లో సాంగ్జావో బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది మృతిచెందారు. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో ప్రమాదం సంభవించింది. చాంగ్కింగ్ ప్రాంతంలో గడిచిన రెండు నెలల్లో ఇది రెండో ప్రమాదం.
చాంగ్కింగ్లోని డయాషుయిడాంగ్ బొగ్గు గనిలో నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రమాదం సంభవించింది. బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధిక స్థాయిలో ఉండటంతో అందులో చికుక్కుపోయిన 18 మంది చనిపోయారు. ఈమేరకు అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని, ఒకరిని కాపాడామని తెలిపింది. భుగర్భ గనుల్లో సరైన పరికరాలను అందుబాటులో ఉంచనందుకుగాను సంస్థపై రెండు నెలలపాటు నిషేధం విధించినట్లు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్నది వెల్లడించింది.
తాజావార్తలు
- క్షీరగిరి క్షేత్రంలో భక్తుల పూజలు
- క్రీడలతో పెరుగనున్న స్నేహభావం
- రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించిన ముత్తిరెడ్డి
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : కలెక్టర్
- ఏడాదిలో రూ.40.63 కోట్లతో అభివృద్ధి పనులు
- సమాజ సేవలో లయన్స్ క్లబ్లు..
- ఘనంగా ఓటరు దినోత్సవం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- రైతన్నల ఆప్తుడు సీఎం కేసీఆర్
- రైతు వ్యతిరేక చట్టాలను నిరసించాలి