బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 15:42:16

వీసా బ్యాన్ ఎత్తేయండి.. అమెరికా కోర్టులో 174 మంది భార‌తీయుల దావా

 వీసా బ్యాన్ ఎత్తేయండి.. అమెరికా కోర్టులో 174 మంది భార‌తీయుల దావా

హైద‌రాబాద్‌: హెచ్‌1బీ వీసాల‌పై ట్రంప్ స‌ర్కార్ ఈ ఏడాది చివ‌ర వ‌ర‌కు నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 174 మంది భార‌తీయలు అమెరికా కోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ కేసును విచారించిన కొలంబియా జిల్లాకోర్టు జ‌డ్జి కెటంజీ బ్రౌన్ జాక్స‌న్‌.. విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ చాద్ ఎఫ్ వోల్ఫ్‌, కార్మిక మంత్రి యూజీన్ స్కాలియాల‌కు నోటీసులు జారీ చేశారు. హెచ్‌1బీ లేదా హెచ్‌4 వీసాల‌ను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌ని, కొన్ని కుటుంబాలు వేరుప‌డుతాయ‌ని, ఇది కాంగ్రెస్ సూత్రాల‌కు విరుద్ధ‌మ‌ని పిటిష‌న్‌లో తెలిపారు. 174 మంది భార‌తీయుల త‌ర‌పున న్యాయ‌వాది వాజ్డెన్ బానియాస్ కేసును ఫైల్ చేశారు. 

వీసా బ్యాన్ నిర్ణ‌యాన్ని చ‌ట్ట‌వ్య‌తిరేకంగా ప్ర‌క‌టించాల‌ని పిటిష‌న్‌లో కోరారు. పెండింగ్‌లో ఉన్న హెచ్‌1బీ, హెచ్‌4 వీసాలను పున‌రుద్ద‌రించాల‌ని భార‌తీయులు త‌మ పిటిష‌న్‌లో కోరారు.  హెచ్‌1బీ వీసాల‌ను ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఇచ్చేది లేద‌ని జూన్ 22వ తేదీన ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. logo