ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 06, 2020 , 17:25:47

ప్రపంచంలోనే పొడవైన కాళ్లు ఈమెవేనట..!

ప్రపంచంలోనే పొడవైన కాళ్లు ఈమెవేనట..!

న్యూయార్క్‌: ప్రపంచంలోనే పొడవైన కాళ్లు ఎవరివో తెలుసా. అమెరికాలోని ఆస్టిన్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక మాసి కురిన్‌వి. దీంతో ఆమె గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తున్న ఈమె మోడల్‌ కావాలనే లక్ష్యంతో శ్రమిస్తోందట.  

అయితే, పొడవు కాళ్లతో గిన్నిస్‌లోకెక్కినా నిత్యజీవితంలో వీటితో ఎన్నో తిప్పలుపడుతున్నానని అంటోంది. ఇంటి డోర్‌లోంచి వెళ్లేటప్పుడు వంగి వెళ్లాల్సి వస్తోందని, కారులో కూర్చునేటప్పుడు, దుస్తుల విషయంలో ఇలా చాలాచోట్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పింది. అయినా తన కాళ్లను చూసి ఎప్పుడూ అసహ్యంగా ఫీలవలేదని అంటోంది. మాసి మాత్రమేకాదు..కుటుంబంలో ఆమె తండ్రి 6 అడుగుల 5 అంగుళాల పొడవు, ఆమె సోదరుడు జాకబ్ 6అడుగుల 3అంగుళాల పొడవు ఉన్నారట. మాసి కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే 5 అడుగుల 7 అంగుళాల పొడవు ఉండేదట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo