నారుమళ్లలో నల్లని మబ్బుల అందాలు.. పచ్చని కొండలతో ముచ్చటచెప్పేందుకా అన్నట్టు నడుమొంచుతున్న మేఘాలు.. తలకు తుండుచుట్టి పుడమితల్లికి పురుడు పోస్తున్న అన్నదాత.. మొగులు చాటునుంచి కొండలపైకి తొంగిచూస్తున్న భానుడి సంధ్యా కిరణాలు.. ప్రకృతిమాత పల్లకీ ఎక్కి ఊరేగితున్నట్టు లేదూ.. ఈ చిత్రం.. ! ఖమ్మం జిల్లా మధిర వద్ద పచ్చదనం అందాలు ఆరబోసినట్టు కనిపించిందీ దృశ్యం.