ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 17:25:34

30 చదరపు మీటర్ల ఇంట్లో 164 కుక్కలు..!

30 చదరపు మీటర్ల ఇంట్లో 164 కుక్కలు..!

టోక్యో: 30 చరదపు మీటర్ల ఇంట్లో అతి దయనీయస్థితిలో కుక్కలు..వాటిని చూసి జంతువుల హక్కుల కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి కుక్కలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ అమానుష సంఘటన జపాన్‌లోని ఇజుమో నగరంలో జరిగింది. జంతువుల హక్కుల సంఘం డోబుట్సుకినిన్‌కు గత నెలలో ఈ ప్రాంతంలోని వారు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇంటిలోపలికి వెళ్లిచూడగా కుక్కలు అల్మారాలు, టేబుళ్లు, ఇలా ఎక్కడపడితే అక్కడ పడుకుని కనిపించాయట. దేశంలోనే ఇలాంటి ఘటన ప్రథమమని డోబుట్సుకిన్‌ను సంఘం ప్రతినిధులు తెలిపారు. 2013లోనే ఆ ఇంటియజమానిపై ఫిర్యాదు అందినప్పటికీ అప్పుడు ఆయన అధికారులను లోనికి అనుమతించలేదు. కాగా, 164 కుక్కల సంరక్షణ బాధ్యతలను డొబుట్సుకిన్‌న్‌ సంస్థ తీసుకుంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.