బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 07:58:21

ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. ఘర్షణలో 16 మంది మృతి..

ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. ఘర్షణలో 16 మంది మృతి..

యెరెవాన్ ‌: ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద ప్రత్యేక ప్రాంతం నాగోర్నో-కరాబాక్ష్‌ విషయమై ఆదివారం ఉదయం జరిగిన ఘర్షణల్లో 16 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. అజర్‌బైజాన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆర్మేనియా ఆరోపించింది. ఇరుపక్షాల మధ్య భారీస్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. గత జూలై తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఘర్షణ జరుగడం ఇదే మొదటిసారి. తమ సైనిక బలగాలు రెండు అజర్‌బైజాన్‌ హెలికాప్టర్లను కూల్చివేసి, మూడు ఆ దేశ యుద్ధ ట్యాంకులను దెబ్బతీశాయని ఆర్మేనియా పేర్కొంది. అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌ జాతినుద్దేశించి మాట్లాడుతూ తమకు ప్రాణనష్టం వాటిల్లిందన్నారు. కానీ ఆ వివరాలను వెల్లడించలేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo