శనివారం 29 ఫిబ్రవరి 2020
1523 మంది మృతి.. బీజింగ్‌లో తీవ్ర ఆంక్ష‌లు

1523 మంది మృతి.. బీజింగ్‌లో తీవ్ర ఆంక్ష‌లు

Feb 15, 2020 , 08:41:55
PRINT
1523 మంది మృతి.. బీజింగ్‌లో తీవ్ర ఆంక్ష‌లు

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 1523కు చేరుకున్న‌ది.  కోవిడ్‌-19 వ్యాధి ఆ దేశంలో రోజు రోజుకూ విస్త‌రిస్తున్న‌ది. ఈనెల 14వ తేదీ వ‌ర‌కు క‌రోనా వైర‌స్ సోకిన కేసులు 67 వేల‌కు చేరుకున్నాయి. క‌రోనా చికిత్స పొంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9 వేలకు చేరుకున్న‌ది. మ‌రో 11 వేల మంది క్రిటిక‌ల్ కండీష‌న్‌లో ఉన్న‌ట్లు చైనా వార్తా సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి. హుబేయ్ ప్రావిన్సులో నిన్న ఒక్క రోజే 139 మంది మ‌ర‌ణించారు. కేవ‌లం ఆ రాష్ట్రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 1457గా ఉన్న‌ది. 

మ‌రో వైపు చైనా రాజ‌ధాని బీజింగ్‌లో తీవ్ర ఆంక్ష‌లు విధించారు. సిటీకి వ‌స్తున్న వారంతా ఖచ్చితంగా 14 రోజుల పాటు ఇండ్ల‌ల్లోనే ఉండాలంటూ క్వారెంటైన్ జారీ చేశారు. ఒక‌వేళ ఎవ‌రైనా ఇళ్లు విడిచి వ‌స్తే.. వారికి శిక్ష వేస్తామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. బీజింగ్‌లో రెండు కోట్ల‌కు మించి జ‌నాభా ఉన్న‌ది.  న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు వెళ్లి.. తిరిగి బీజింగ్ చేరుకుంటున్న వారిని ఉద్దేశించి ప్ర‌భుత్వం ఈ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.  ఆఫ్రికా దేశ‌మైన ఈజిప్టులో కూడా వైర‌స్ పాజిటివ్ కేసు న‌మోదైంది.  


logo