మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 10:03:28

బుబోనిక్ ప్లేగుతో 15 ఏళ్ల కుర్రాడు మృతి

బుబోనిక్ ప్లేగుతో 15 ఏళ్ల కుర్రాడు మృతి

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ మంగోలియాలో 15 ఏళ్ల కుర్రాడు.. బుబోనిక్ ప్లేగుతో మృతిచెందాడు. వ్యాధి సోకిన మార్మ‌ట్ మాంసాన్ని సేవించ‌డం వ‌ల్ల అత‌ను మ‌ర‌ణించిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల‌ల్డించింది. మార్మ‌ట్ మాంసాన్ని తిన్న మ‌రో ఇద్ద‌రు టీనేజ‌ర్లు ప్ర‌స్తుతం యాంటీబ‌యాటిక్ చికిత్స తీసుకుంటున్నారు. బుబోనిక్ ప్లేగు విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో గోబి-ఆల్టాయి ప్రావిన్సులో క్వారెంటైన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. చ‌నిపోయిన కుర్రాడితో కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన 15 మందిని క్వారెంటైన్ చేసిన‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. అనుమానితులంద‌రికీ యాంటిబ‌యాటిక్స్ చికిత్స అందిస్తున్నారు.  జంతువుల‌ను వేటాడ‌డం, మార్మ‌ట్ మాంసాన్ని తిన‌డం ఆపేయాల‌ని దేశ ప్ర‌జ‌ల‌కు మంగోలియా ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 

మ‌రోవైపు చైనాలో ప్లేగు సోకిన ఓ వ్య‌క్తి ప్ర‌స్తుతం కోలుకుంటున్న‌ట్లు ఆ దేశ వార్తా సంస్థ పేర్కొన్న‌ది. ఆ కేసుతో లింకున్న‌వారి క్వారెంటైన్ కూడా ఆదివారం ముగిసింది. ఈ ఏడాది చివ‌ర‌కు మార్మ‌ట్ మాంసాన్ని తిన‌వ‌ద్దు అంటూ బ‌య‌న్నూర్ ప్రాంత వాసుల‌కు హెచ్చ‌రిక‌లు చేశారు. logo