జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆ దేశ సుప్రీంకోర్టు 15 నెలల జైలు శిక్ష విధించింది. 2009 నుంచి 2018 వరకూ తొమ్మిది ఏండ్లపాటు సాగిన జుమా పాలనలో భారీగా అవినీతి చోటుచేసుకుందని, ఆయన ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారని ఆరోపిస్తూ గతంలో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ముందు ఆయన హాజరుకాకపోవడంతో ఆయనకు రెండేండ్ల జైలుశిక్ష విధించాలని కమిషన్ సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది.