ఆదివారం 23 ఫిబ్రవరి 2020
అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం

అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం

Feb 15, 2020 , 01:01:37
PRINT
అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం
  • 13 మంది బాలల మృతి.. హైతిలో ఘటన

పోర్ట్‌-ఔ-ప్రిన్స్‌, ఫిబ్రవరి 14: హైతి రాజధాని పోర్ట్‌-ఔ-ప్రిన్స్‌ నగరశివారుల్లోని ఒక అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలానికి ఫైరింజన్లు వచ్చేసరికి గంటన్నర సమయం గడిచిపోయిందని అనాధాశ్రమంలోని బాలల సంరక్షకురాలు రోస్‌ మారీ లూయిస్‌ చెప్పారు. దీంతో 13 మంది బాలలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పోర్ట్‌-ఔ-ప్రిన్స్‌ నగర శివారుల్లోని కెన్‌స్కాఫ్‌ ప్రాంతంలో చర్చి ఆఫ్‌ బైబిల్‌ ఆధ్వర్యంలో ఈ అనాధాశ్రమం నిర్వహిస్తున్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఆరేండ్ల లోపు వయస్కులని, మిగతావారు 10-11 ఏండ్ల లోపు వారని సమీప బాప్టిస్ట్‌ మిషన్‌ దవాఖాన వర్గాలు తెలిపాయి. సకాలంలో అంబులెన్స్‌ వచ్చి ఉంటే వారి ప్రాణాలు కాపాడగలిగే వారమని పౌర అధికారి ఒకరు చెప్పారు. 


logo