మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 12, 2020 , 15:00:37

యూకేలో కరోనాతో ఒకేరోజు 148 మంది మృతి

యూకేలో కరోనాతో ఒకేరోజు 148 మంది మృతి

లండన్‌ : యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో గడిచిన 24 గంటల్లో 148 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో మృతుల సంఖ్య 44,798కు చేరిందని బ్రిటీష్‌ ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం తెలిపింది. శనివారం ఉదయం నాటికి బ్రిటన్‌లో 2,88,953 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 512 కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య శనివారానికి 820కి పెరిగింది. శుక్రవారం రోజు కేవలం 48 మంది మాత్రమే మృతి చెందగా శనివారం 148 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 

అయితే యూకేలో లాక్‌డౌన్‌ ఎత్తివేసి అన్ని కార్యకలాపాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాకుండా పబ్బులు, బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకోవడంతో తాజాగా కేసులు భారీగా పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo