సోమవారం 18 జనవరి 2021
International - Dec 09, 2020 , 22:03:26

144 అంతస్తుల టవర్స్‌.. పది సెకండ్లలో నేలమట్టం

144 అంతస్తుల టవర్స్‌.. పది సెకండ్లలో నేలమట్టం

దుబాయ్‌: అబుదాబిలోని మినా జాయెద్ ప్రాంతంలో 144 అంతస్తుల ఐకానిక్ మినా ప్లాజా టవర్లను కేవలం పది సెకండ్లలో నేలమట్టం చేశారు. గత నెలలో చేపట్టిన 165 మీటర్ల ఎత్తైన ప్లాజా టవర్‌ కూల్చివేత గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుకెక్కింది. దీని కోసం ఆరు వేల కేజీల నియంత్రిత ప్లాస్టిక్‌ పేలుడు పదార్థాలు, 18 వేల డిటోనేటర్లు, డిటోనేటర్‌ కార్డు ద్వారా రిమోట్‌ పద్ధతిలో కూల్చివేతలు నిర్వహించారు. 1972లో ప్రారంభించిన మినా జాయెద్‌ పునర్నిర్మాణంలో చేపడుతున్న మెగా ప్రాజెక్టులో భాగంగా 40 ఏండ్ల కిందట నిర్మించిన 144 అంతస్తుల ప్లాజా టవర్లను నియంత్రిత పద్ధతితో కేవలం పది సెకండ్లలో నేలమట్టం చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.