బుధవారం 03 జూన్ 2020
International - Apr 02, 2020 , 20:23:24

కోవిడ్‌19.. ఆ 14 మంది అమ‌రులు

కోవిడ్‌19.. ఆ 14 మంది అమ‌రులు


హైద‌రాబాద్‌: చైనాలోని హుబేయ్ ప్రావిన్సు కేంద్రంగా కోవిడ్‌19 మ‌హ‌మ్మారి విజృంభించిన విష‌యం తెలిసిందే. అయితే అక్క‌డ ప్రాణాలు కోల్పోయిన 14 మంది వైద్య సిబ్బందిని అమ‌రులుగా కీర్తిస్తూ స్థానిక ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.  జాతీయ విధానాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సిబ్బందిని అమ‌రులుగా గుర్తిస్తున్న‌ట్లు హుబేయ్ గ‌వ‌ర్న‌మెంట్ పేర్కొన్న‌ది.  క‌రోనా వైర‌స్ సోకిన‌వారికి సేవ‌లు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఫ్రెంట్‌లైన్ మెడిక్స్‌, ఎపిడ‌మిక్ ప్రివెన్ష‌న్ వ‌ర్క‌ర్ల పేర్ల‌ను ఆ ప్ర‌భుత్వం రిలీజ్ చేసింది. కోవిడ్‌19 మ‌హ‌మ్మారి ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసింద‌ని, ఆ వైర‌స్‌ను నియంత్రించేందుకు రిప‌బ్లిక్ చైనా చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌న్నారు.  క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా.. అమ‌రుడు అన్న టైటిల్‌ను అత్యున్న‌త గౌర‌వంగా భావిస్తుంది. దేశం కోసం ధైర్యంగా ప్రాణాలు అర్పించేవారిని అమ‌రులుగా గుర్తిస్తామ‌ని హుబేయ్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

 logo