1990 నుంచి పాకిస్తాన్లో 138 మంది జర్నలిస్టులు మృతి

ఇస్లామాబాద్ : గత 30 ఏండ్లలో పాకిస్తాన్లో కనీసం 138 మంది జర్నలిస్టులు మరణించారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐసీజే) వెల్లడించింది. ఇరాక్, మెక్సికో, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, భారతదేశం దేశాలను "ప్రపంచంలోని జర్నలిజం సాధన కోసం అత్యంత ప్రమాదకరమైన దేశాలు" గా జాబితా చేసినట్లు ఐసీజే విడుదల చేసిన 'గ్లోబల్ జర్నలిజంపై శ్వేతపత్రం'లో తెలిపారు.
ఐసీజే శ్వేతపత్రం ప్రకారం.. 1990 నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్లో 138 మంది, భారతదేశంలో 116 మంది జర్నలిస్టులు దారుణహత్యకు గురయ్యారు. ఆసియా మొత్తం మరణాలలో ఇది 40 శాతం పసిఫిక్ ప్రాంతందే కావడం విశేషం. 2020 ప్రారంభం నుంచి 15 దేశాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు, బాంబు పేలుళ్లు, క్రాస్ ఫైర్ సంఘటనలలో ఇప్పటివరకు 42 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఈ సంవత్సరం నలుగురు పాకిస్తాన్ జర్నలిస్టులు - అజీజ్ మీనన్, జవేదుల్లా ఖాన్, అన్వర్ జాన్, షాహీనా షాహీన్ ప్రాణాలు కోల్పోయారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గత జాన్ నెలలో జరిగిన జర్నలిస్ట్ హత్య తరువాత న్యాయం కోసం నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తొలుత నిరసనలు జరిగిన బర్ఖన్లో జర్నలిస్టును ఇద్దరు ముష్కరులు కాల్చి చంపారు. అనంతరం ఈ నిరసనలు ప్రాంతీయ రాజధాని క్వెట్టా, గ్వాడార్ ఓడరేవు నగరానికి వ్యాపించాయి. సోషల్ మీడియాలో #JusticeforAnwarJan అనే హ్యాష్‌ట్యాగ్ కూడా సృష్టించబడింది. 2019 లో దేశవ్యాప్తంగా కనీసం ఏడుగురు జర్నలిస్టులు మరణించారని కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్ న్యూస్‌పేపర్ ఎడిటర్స్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి
- ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
- వృద్ధులకు అండగా ఉండడం అభినందనీయం
- ఇక 24 గంటలు మంచి నీళ్లు
- వీరుడికి సెల్యూట్
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు కీలకం
- జంగుబాయి క్షేత్రం జనసంద్రం
- మాజీ సర్పంచ్ మృతికి పలువురి సంతాపం
- మిర్యాలగూడ శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి