బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 12:03:42

నేపాల్‌లో వ‌ర‌ద‌ల బీభ‌త్సం!

నేపాల్‌లో వ‌ర‌ద‌ల బీభ‌త్సం!

ఖాట్మండు: నేపాల్‌లో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ప‌లుచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుత‌న్నాయి. ఈ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు దేశ‌వ్యాప్తంగా దాదాపు 998 కుంటుంబాలను ప్ర‌భావితం చేశాయి. వివిధ ప్ర‌మాదాల్లో మొత్తం 132 మంది నేపాలీలు ప్రాణాలు కోల్పోయారు. 128 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌రో 53 మంది గ‌ల్లంత‌య్యారు. 

దీంతో నేపాల్‌ని ప‌లు ప్రాంతాల్లో ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాతున్నాయి. ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి పునరావాస కేంద్రాల్లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. నేపాల్ డిజాస్ట‌ర్ రిస్కు రిడ‌క్ష‌న్ & మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు ఎప్పటిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ బాధితుల‌కు సాయం అందిస్తున్నారు. ‌         

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo