బుధవారం 03 జూన్ 2020
International - May 02, 2020 , 17:57:42

పాకిస్థాన్లో ఒకేరోజు 1300 క‌రోనా కేసులు

పాకిస్థాన్లో ఒకేరోజు 1300 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్థాన్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు 24 గంటల వ్య‌వ‌ధిలోనే అక్క‌డ కొత్త‌గా 1300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన‌ప్ప‌టి నుంచి దేశంలో ఒక్కరోజులోనే ఇన్ని కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారని పాకిస్థాన్‌ మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,114కు చేరిందని తెలిపింది. వారిలో 4,175 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మ‌రో 417 మంది మరణించారని ప్ర‌క‌టించింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo