శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 15:22:57

ఆప్ఘనిస్థాన్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం

ఆప్ఘనిస్థాన్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం

కాబూల్‌ :  ఆప్ఘనిస్థాన్‌లోని ఖార్వార్‌ జిల్లా తూర్పు లోగార్‌ ప్రావిన్స్‌లో భద్రతా దళాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.  ప్రశాంతంగా ఉన్న ఖార్వార్‌ జిల్లాలో గత రెండు వారాలుగా తాలిబన్లు వరుస దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు ప్రభుత్వ భద్రతా దళాలు, ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగాయి. బుధవారం  ఆపరేషన్‌ ప్రారంభించగా..  ఇప్పటి వరకు 13 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు తూర్పు లోగార్‌ ప్రావిన్స్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి షాపూర్‌ అహ్మాద్‌జై తెలిపారు.  భద్రతా దళాల్లో ఎవ్వరూ గాయపడలేదని, ఆపరేషన్‌ చివరి దశలో ఉందని ఆయన పేర్కొన్నారు.  భద్రతా దళాల ఆపరేషన్‌పై తాలిబన్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo