గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 11:57:03

వ్యాన్‌ పల్టీ.. నిప్పంటుకొని 13 మంది సజీవదహనం

 వ్యాన్‌ పల్టీ.. నిప్పంటుకొని 13 మంది సజీవదహనం

సింధ్‌ : పాకిస్థాన్‌లోని సింధ్‌‌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరాచీ-హైదరాబాద్‌ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొని బోల్తాపడి మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో 13 మంది వ్యాన్‌లోనే సజీవ దహనమయ్యారు. డ్రైవర్‌తో సహా ఏడుగురిని స్థానికులు కాపాడారు. ప్రమాద సమయంలో వ్యానులో 20 మంది ప్రయాణిస్తున్నారు.

వ్యాన్‌ అతివేగం కారణంగా రోడ్డుపై అనేక పల్టీలు కొట్టడంతో వాహనానికి బిగించిన సీఎన్‌జీ సిలిండర్‌కు మంటలు అంటుకొని చూస్తుండగానే పూర్తిగా వ్యాపించాయని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మృతదేహాలు గుర్తించేందుకు వీళ్లేన్నంతగా కాలిపోయాయని, డీఎన్‌ఏ పరీక్షతోనే వివరాలు గుర్తించడం సాధ్యమని నూరియాబాద్‌ డీఎస్పీ నాజర్‌ మెహమూద్‌ దీషక్‌ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo