శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 12:47:37

మెక్సికోలో బస్సు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

మెక్సికోలో బస్సు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

మెక్సికో సిటీ : మెక్సికో ఆగ్నేయ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘుటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 21 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు.

గ్వాటేమాల సరిహద్దులోని చియాపాస్ రాష్ట్రం లా ట్రినిటేరియా- ఫంటేరియా కోమలపా పట్టణాల మధ్య ప్రమాదం జరిగిందని ఆ రాష్ట్ర ప్రానిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo