శుక్రవారం 29 మే 2020
International - Mar 29, 2020 , 21:51:56

యూకేలో 1,228 క‌రోనా మ‌ర‌ణాలు

యూకేలో 1,228 క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే)లో క‌రోనా ర‌క్కిసి విజృంభిస్తున్న‌ది. క‌రోనా కేసుల‌తోపాటే మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌ది. తాజాగా ఆదివారం ఒక్క‌రోజే యూకేలో 209 మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు. దీంతో అక్క‌డ సంభ‌వించిన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,228కి చేరుకుంది. యూకే క్యాబినెట్ మినిస్ట‌ర్ మైఖేల్ గోవ్ ఆదివారం ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. 

కాగా, క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డంలో భాగంగా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో సైతం లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయినా క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతుండ‌టం యూకే ప్ర‌భుత్వాన్ని, అధికారుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏ మాత్రం నిర్ల‌క్ష్యాన్ని ద‌రిచేర‌నీయ‌కుండా లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించాల‌ని మైఖేల్ గోవ్ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. 


logo