గురువారం 03 డిసెంబర్ 2020
International - Oct 23, 2020 , 13:04:43

వైమానికి దాడి : 12 మంది తాలిబన్‌ తీవ్రవాదులు హతం

వైమానికి దాడి : 12 మంది తాలిబన్‌ తీవ్రవాదులు హతం

కాబూల్‌ :  ఆఫ్ఘన్‌ సైనికులు గురువారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు పాక్‌ జాతీయులతో సహా 12మంది తాలిబన్‌ తిరుగుబాటుదారులు హతమమ్యారు.  మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఖోఘ్యాని జిల్లా దండో ప్రాంతంలో ఈ దాడి జరిగిందని ఆ ప్రావిన్స్‌ గవర్నర్‌ కార్యాలయం శుక్రవారం తెలిపింది.

తిరుగుబాటుదారుల నుంచి భద్రతాదళాలు ఏడు ఏకే రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సాధారణ పౌరులు, భద్రతా దళాలు గాయపడలేదు. ఇటీవల ఆఫ్ఘన్‌ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో సైన్యం జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.