శనివారం 06 జూన్ 2020
International - May 04, 2020 , 16:25:03

నేపాల్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

నేపాల్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

ఖాట్మండు: నేపాల్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృత్యువాత పడ్డారు. మృతులంతా మహోత్తరి జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు చెందినవారు. అయితే, వారంతా కల్తీ మద్యం సేవించడంవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుల నుంచి శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపించామని, ఆ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వస్తే వారి మరణాలకుగల కారణం ఎమిటో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. చనిపోయిన అందరిలోనూ ఒకే రకమైన ఆనారోగ్య లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. అందరూ కడుపులో నొప్పి, డయేరియా, వాంతులతో బాధపడ్డారని చెప్పారు. వారంతా స్థానికంగా తయారయ్యే కల్తీ మద్యం తాగినట్లు అధికారులు గుర్తించారు.      


logo