ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 18, 2021 , 18:04:36

వారం క్రితం కూలిన బంగారు గ‌ని.. శిథిలాల కింద బ్ర‌తికున్న కార్మికులు

వారం క్రితం కూలిన బంగారు గ‌ని.. శిథిలాల కింద బ్ర‌తికున్న కార్మికులు

బీజింగ్‌:  చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్సులో ఉన్న హుషాన్ బంగారు గ‌ని కూలిన ఘ‌ట‌న‌లో 12 మంది కార్మికులు స‌జీవంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  వారం రోజుల క్రితం కూలిన ఆ గ‌నిలో అనేక మంది కార్మికులు చిక్కుకున్నారు. అయితే 12 మంది మాత్రం స‌జీవంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. మ‌రో ప‌ది మంది గ‌ని కార్మికుల జాడ తెలియ‌డం లేదు.  త‌మ‌కు ఆహారం, మందులు పంపించాలంటూ బ్ర‌తికి ఉన్న 12 మంది కార్మికులు సందేశం పంపారు.  గ‌నిలో జ‌రిగిన భారీ పేలుడు వ‌ల్ల ఎగ్జిట్ ద్వారం ధ్వంస‌మైంది.  ఆ గ‌నిలో ఉన్న క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ కూడా డ్యామేజ్ అయ్యింది. ఓ చిన్న రంధ్రం ద్వారా ఆహారాన్ని, మందుల‌ను, పెప‌ర్, పెన్సిళ్ల‌ను పంపారు.  పెయిన్ కిల్ల‌ర్స్ కావాలంటూ వాళ్లు ఓ లేఖ ద్వారా తెలిపారు. గ‌ని ఎంట్రెన్స్ నుంచి సుమారు 600 మీట‌ర్ల లోతులో కార్మికులు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.  గ‌ని కూలిన ఘ‌ట‌న కూడా ఓ రోజు ఆల‌స్యంగా తెలిసింది. దీంతో రెస్క్యూ ప‌నుల్లో జాప్యం జ‌రిగింది. సంఘ‌ట‌న‌ను రిపోర్ట్ చేయ‌డంలో ఆల‌స్యం జ‌ర‌గ‌డం వ‌ల్ల స్థానిక అధికారుల‌ను ప్ర‌భుత్వం తొల‌గించింది. చైనాలో గ‌త ఏడాది సంభ‌వించిన ప‌లు గ‌ని కూలిన ఘ‌ట‌న‌ల్లో  అనేక మంది మ‌ర‌ణించారు. 

VIDEOS

logo