శనివారం 06 జూన్ 2020
International - Apr 14, 2020 , 18:12:00

117 మిలియన్ల పిల్లలు మీజిల్స్‌ బారిన పడే అవకాశం: యూఎన్‌వో హెచ్చరిక

117 మిలియన్ల పిల్లలు మీజిల్స్‌ బారిన పడే అవకాశం: యూఎన్‌వో హెచ్చరిక

హైదరాబాద్‌: ప్రాణాంతక కరోనా మహమ్మారిని కట్టడిచేయడంమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచ దేశాలు పనిచేస్తేన్నాయి. అయితే దీనిచాటున మరో ముప్పు రాబోతున్నదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కరోనాపై పోరుతో చాలా దేశాలు చిన్నపిల్లలను వివిధ వ్యాధుల బారినుంచి రక్షించేందు చేపట్టే టీకా కార్యక్రమాలను తగ్గించుకున్నాయని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 117 మిలియన్ల మంది గవద బిల్లల వ్యాధిబారిన పడే అవకావం ఉన్నదని హెచ్చరించింది. ఇప్పటికే 24 దేశాలు ఈ వ్యాక్సినేషన్‌ను నిలిపివేశాయని, కరోనా వైరస్‌ కారణంగా మరో 13 దేశాలు టీకా  కార్యక్రమాన్ని ఆపివేశాయని డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్‌ వెల్లడించాయి. ప్రతి ఏడాది సుమారు 20 మిలియన్ల మంది ఈ ప్రాణాంతక మీజిల్స్‌ బారిన పడుతున్నారని, ఇదులో అత్యధికులు ఐదేండ్లలోపు చిన్నారులే ఉన్నారని తెలిపాయి. 2018లో ఈ వ్యాధి వల్ల లక్షా 40వేల మంది మరణించారని, ఇందులో చిన్నారులే అధికమని వెల్లడించాయి.


logo