గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 16:34:45

కరోనా క‌ష్టాల్లోనూ.. ఓటేసిన 116 ఏళ్ల బామ్మ‌

కరోనా క‌ష్టాల్లోనూ.. ఓటేసిన 116 ఏళ్ల బామ్మ‌

హైద‌రాబాద్‌: క‌రోనా క్రైసిస్ ఉన్నా.. ద‌క్షిణ‌కొరియాలో ఇవాళ జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ దేశంలో సుమారు 50 శాతం మంది ఓటేశారు. మాస్క్‌లు, గ్లౌజ్‌లు పెట్టుకుని ఓటింగ్ సెంట‌ర్ల వ‌ద్ద జ‌నం బారులు తీరారు. అత్యంత ప్ర‌భావానికి గురైన డైగూ ప్రాంతంలో అధిక సంఖ్య‌లో ఓటింగ్ జ‌రిగింది. ఇక సియోల్ ఓ వృద్ధ  మ‌హిళ‌ ఓటేసింది. ఆ బామ్మ వ‌య‌సు 116 ఏళ్లు. కోచియ‌న్ కౌంటీలో ఉండే ఆ బామ్మ త‌న కూతురుతో వ‌చ్చి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.  300 సీట్ల‌కు దేశ‌వ్యాప్తంగా అసెంబ్లీ  ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. క్వారెంటైన్ సెంట‌ర్ల‌లో ఉన్న‌వారికి కూడా ఓటు హ‌క్కును క‌ల్పించారు.


logo