శనివారం 30 మే 2020
International - May 12, 2020 , 16:37:30

కరోనాను జయించిన 113 ఏండ్ల బామ్మ

కరోనాను జయించిన 113 ఏండ్ల బామ్మ

మాడ్రిడ్‌: కరోనా వైరస్‌ ఎక్కడ తమను పట్టుకొంటుందో అని అందరూ భయపడుతున్న వేళ.. 113 ఏండ్ల బామ్మ ఒకరు కరోనాను జయించి ఇంటికి చేరారు. దవాఖాన నుంచి ఇంటికి బయల్దేరిన ఆమెను.. వైద్యులు, వైద్య సిబ్బంది చప్పట్లు కొట్టి  వీడ్కోలు పలికారు. ఈ ఘటన స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మంగళవారం జరిగింది. గత వారం కూడా 106 ఏండ్ల మహిళ కూడా కరోనా వైరస్‌ నుంచి విజయవంతంగా బయటపడింది.

స్పెయిన్‌ ఈశాన్య ప్రాంతానికి చెందిన 113 ఏండ్ల  వయసున్న మరియా బ్రన్యాస్‌.. గత నెలలో తానుండే ఓల్డేజ్‌ కేర్‌ హోంలో కరోనా వ్యాధికి గురైంది. వెంటనే ఆమెను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందజేశారు. దాంతో ఆమె కోలుకొని మంగళవారం ఇంటికి వెళ్లిపోయింది. కాగా, 1918-19లో సంభవించిన స్పానిష్‌ ఫ్లూ మహమ్మారిని, ప్రపంచ యుద్ధాలను, స్పానిష్ సివిల్‌ వార్‌ను దగ్గర నుంచి చూసిన జీవించి ఉన్న వ్యక్తిగా బ్రన్యాస్‌ రికార్డులకెక్కారు. ఈవిడ స్పెయిన్‌లో అత్యధిక వయస్కురాలిగా కూడా నమోదైంది. 


logo