గురువారం 13 ఆగస్టు 2020
International - Aug 01, 2020 , 17:17:58

అతి పెద్ద న‌త్త‌ను క‌నుగొన్న బాలుడు.. ఆ యూనివ‌ర్సిటీకి విరాళం!

అతి పెద్ద న‌త్త‌ను క‌నుగొన్న బాలుడు.. ఆ యూనివ‌ర్సిటీకి విరాళం!

రోడ్ ఐలాండ్‌కు చెందిన 11 ఏండ్ల బాలుడు ఒక పెద్ద న‌త్త‌ను క‌నుగొన్నాడు. ఇది ఏకంగా రెండున్న‌ర పౌండ్ల బ‌రువు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ అబ్బాయి త‌న తాత‌తో కలిసి తిరుగుతున్నప్పుడు ఈ మొల‌స్క్ క‌నిపించింద‌ని చెబుతున్నాడు. దీనిని న‌ర్రాగ‌న్ సెట్‌లోని యూనివ‌ర్శిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ మెరైన్ సైన్స్ రీసెర్చ్ ఫెసిలిటీకి విరాళంగా ఇ‌చ్చిన‌ట్లు విశ్వ‌విద్యాల‌యం ప్ర‌క‌టించింది. 

ఈ న‌త్త 5.75 అంగుళాలు ఉంది. అంతేకాదు 1.3 కిలోగ్రాముల బ‌రువు ఉంది. అయితే దీన్ని ఇంకా రికార్డులోకి ఎక్కించ‌లేదు. ఎందుకంటే ఇది ఇంకా 10 సెం.మీ. వ‌ర‌కు పెరుగుతుంద‌ని తెలిపారు. యుఆర్ఐ మెరైన్ సైన్స్ రీసెర్చ్ ఫెసిలిటీ మేనేజర్ ఎడ్ బేకర్ ఈ క్వాహోగ్‌ను ప్రదర్శనలో ఉంచాలని యోచిస్తున్నాడు.


logo