శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 19:17:58

అమ్మ‌మ్మ ప్రాణాలు కాపాడేందుకు కార్ డ్రైవ్ చేసిన బాలుడు!

అమ్మ‌మ్మ ప్రాణాలు కాపాడేందుకు కార్ డ్రైవ్ చేసిన బాలుడు!

మంచిత‌నం అనేది చిన్న‌త‌నం నుంచే మొద‌ల‌వుతుంది. ప్ర‌మాదాలు అనేవి చెప్పి రావు. హ‌ఠాత్తుగా వచ్చిన‌ ప్ర‌మాదాల‌ను స‌మ‌య‌స్ఫూర్తితో ఎదుర్కొన్న‌ప్ప‌డే వారి ప్ర‌తిభ బ‌య‌ట‌ప‌డుతుంది. 11 ఏండ్ల  వ‌య‌సులోనే పిజె బ్రూవర్-లే త‌న అమ్మ‌మ్మ‌ను కాపాడుకున్నాడు. బామ్మ‌కు ఉన్న‌ట్టుండి షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గిపోయాయి. దీంతో ఆమె కింద ప‌డిపోయింది. అమెకు ప్ర‌థ‌మ చికిత్స అవ‌స‌రం అని ఆమెను ఇంటికి తీసుకెళ్లాల‌నుకున్నాడు. ఏం చేయాలో తోచ‌లేదు. ప‌క్క‌నే కారు ఉంది. కానీ లైసెన్స్ లేదు.

మ‌రేం ప‌ర్వాలేదు. బామ్మ క‌న్నా ఇదేం ముఖ్యం కాద‌నుకొని బామ్మ‌ను ఇంటికి చేర్చి గ్లూకోజ్ టాబ్లెట్స్ ఇచ్చాడు.  దీంతో ఆమె కోలుకున్న‌ది. ఈ సంఘ‌ట‌న ఇండియానాలో చోటు చేసుకున్న‌ది. అత‌ను చేసిన మంచి ప‌నికి అంద‌రి నుంచి ప్ర‌సంశ‌లు అందుకుంటున్నాడు. అ విష‌యాన్ని బామ్మ త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఏదేమైనా ఇంత చిన్న వ‌య‌సులో అత‌ను చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. 


logo