బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 00:53:52

టైమ్స్‌ ‘వర్ధమాన’ 100లో.. 11 భారత వర్సిటీలు

టైమ్స్‌ ‘వర్ధమాన’ 100లో.. 11 భారత వర్సిటీలు

లండన్‌: వర్ధమాన దేశాల్లోని విశ్వవిద్యాలయాలలో భారత్‌కు చెందిన 11 యూనివర్సిటీలు మంచి పనితీరును కనబరిచి టాప్‌ 100లో స్థానం పొందాయని టైమ్స్‌ హయ్య ర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ తెలిపింది. వర్ధమాన దేశాల్లోని వర్సిటీల ర్యాంకింగ్‌లను మంగళవారం సాయంత్రం లండన్‌లో విడుదల చేసింది. మొత్తం 47 దేశాల్లోని వర్సిటీలకు ర్యాంక్‌లు ప్రకటించగా, వాటిలో చైనాకు చెందినవి 30 ఉన్నాయి. వర్ధమాన దేశాలలోని మొత్తం 533 వర్సిటీల్లో భారత్‌కు చెందిన 56 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లు ఇచ్చారు. కాగా టాప్‌ 100లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) 16వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమృత విశ్వవిద్యాపీఠం 51 స్థానాలు మెరుగుపరచుకొని టాప్‌ 100లో స్థానం సంపాదించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ 23 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి, ఐఐటీ ఢిల్లీ 38కి, ఐఐటీ మద్రాస్‌ 63వ స్థానానికి వచ్చాయి. 


logo