బుధవారం 03 జూన్ 2020
International - Apr 24, 2020 , 07:07:13

సౌదీ లో క‌రోనాతో 11 మంది మృతి: భార‌త రాయ‌బార కార్యాల‌యం

సౌదీ లో  క‌రోనాతో 11 మంది మృతి: భార‌త రాయ‌బార కార్యాల‌యం

రియాద్ : సౌదీ అరేబి‌యాలో 11 మంది భార‌తీయులు క‌రోనా కోవిడ్‌-19 బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భార‌త రాయ‌భార కార్యాల‌యం వ‌ద్ద ఉన్న స‌మాచారం మేర‌కు ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది భార‌తీయులు కోవిడ్ తో మ‌ర‌ణించ‌గా..వీరిలో మ‌దీనాలో న‌లుగురు, మ‌క్కాలో ముగ్గురు, జెడ్డాలో ఇద్ద‌రు, రియాద్‌, డామ్మ‌మ్ లో ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. ఏప్రిల్ 22 వ‌ర‌కు ఈ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 

లాక్ డౌన్ కార‌ణంగా భార‌త్ కు విమానాల స‌ర్వీసుల రాక‌పై నిషేధం ఎత్తివేయ‌లేమ‌ని ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సౌదీ అరేబియాలో  ఉన్న భార‌తీయుల‌ను త‌ర‌లించే విష‌య‌మై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని వెల్ల‌డించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo