శుక్రవారం 03 జూలై 2020
International - Jun 01, 2020 , 13:29:37

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది వలస కూలీల మృతి

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది వలస కూలీల మృతి

హైదరాబాద్‌: భారత్‌ నుంచి నేపాల్‌ వెళ్తున్న వలస కూలీలు స్వస్థలానికి చేరుకోకముందే మరణించారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 30 మందికిపైగా వలస కార్మికులు ప్రత్యేక బస్సులో నేపాల్‌ వెళ్తున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత నేపాల్‌లోని బాంకే జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కుని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తోపాటు 11 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నేపాల్‌లో ఇప్పటివరకు 1572 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 8 మంది మరణించారు. 


logo