శనివారం 30 మే 2020
International - May 22, 2020 , 16:09:04

కుప్పకూలిన విమానంలో 107 మంది..

కుప్పకూలిన విమానంలో 107 మంది..

ఇస్లామాబాద్‌ : కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని మోడల్‌ కాలనీలోని ఇండ్లపై పీకే-303 విమానం కుప్పకూలిన విషయం విదితమే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 107 మంది ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో 91 మంది ప్రయాణికులు కాగా, మిగతా వారు సిబ్బంది. అయితే విమానం కూలిన ప్రాంతంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విమానం కూలిన నివాసాల్లో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చు అని కరాచీ అధికారులు భావిస్తున్నారు. నాలుగు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనాస్థలిలో ఆర్మీ, పోలీసు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 
logo